గేట్ 2025 పరీక్షల షెడ్యూల్ ఖరారు! 1 m ago
ఐఐటీ రూర్కీ గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) 2025 కి గాను పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ పరీక్షలు 2025 ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో జరుగనున్నాయి. అప్లికేషన్‌లో ఏమైనా ఎడిట్ చేసుకోవాలంటే నవంబర్ 20 వరకు అభ్యర్ధులకు వెసులుబాటు కల్పించారు. గేట్ అభ్యర్థులు పరీక్షల షెడ్యూల్‌ను అధికారిక వెబ్‌సైట్ gate2025.iitr.ac.in లో చెక్ చేసుకోవచ్చు. ఫలితాలు మార్చి 2025లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు ఐఐటీ రూర్కీ తెలిపింది.